![]() |
![]() |

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం' (Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-71 లో... వీరు రౌడీలతో మాట్లాడతాడు. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి.. ఆ రుద్ర మిమ్మల్ని ఫాలో అవుతాడని చెప్తాడు. సరే సర్ మీ తమ్ముడిని అక్కడ నుండి తీసుకొని వెళదామా అని రౌడీలు అడుగుతారు. లేదు ఇప్పుడు తమ్ముడు దగ్గరికి ఎవరు వస్తున్నారు ఏంటని రుద్ర కనిపెడుతుంటాడని వీరు అంటాడు.
మరొకవైపు రుద్ర, సూర్యకి ఫోన్ చేసి హాస్పిటల్ కి ఎవరైనా వచ్చారా అని అడుగుతాడు. లేదని సూర్య అంటాడు. ఆ తర్వాత రుద్ర జ్ఞాపకాల తాలూకు ఫోటో ఆల్బమ్ ని గంగ బయటకు తీస్తుంది. ఓపెన్ చేసి చూస్తుంటే స్నేహ వచ్చి ఇది ఎవరి ఆల్బమ్ అని ఆటపట్టిస్తుంది. ఆల్బమ్ ని తీసుకొని బయటకు వచ్చి పెద్దసారుకి చెప్తుంది. వంశీ, సూర్య స్నేహ అందరు కలిసి ఆల్బమ్ తో ఆడుతూ గంగని ఆటపట్టిస్తారు. అది నాది కాదు రుద్ర సర్ ది అని గంగ అంటున్నా వాళ్ళు వినిపించుకోరు.. ఆల్బమ్ కిందపడుతుంది.
ఆ తర్వాత రుద్ర వచ్చి ఆల్బమ్ చూసి తన మాజీ లవర్ ని గుర్తు చేసుకుంటాడు. ఎందుకు ఈ ఆల్బమ్ బయటకు తీశారని గంగపై కోప్పడతాడు. ఆ తర్వాత రుద్ర గంగకి ఫోన్ చేస్తాడు. నిన్న ఫోన్ చేశారు ఎవరు అని అడుగుతాడు. చిట్టి ఫ్రెండ్ ని నాకూ హెల్ప్ చెయ్యమని చెప్పింది కదా అని అంటుంది. అవునని రుద్ర అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |